telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అల్లరి మనసుకు…నీ రూపమయమైన ఆలోచనలు

నా అల్లరి మనసుకు
నీ రూపమయమైన ఆలోచనలు
నీ మనసుతో మాట్లాడాలనే కుతూహలం పెరుగుతు
నీ వద్దకు చేరుకుంది…
నిను చూస్తు నీ ప్రతికదలికను నయనానందకరంగా తిలకిస్తున్నది..
నీవు నను చూడకుండా
నిను నేను చూస్తు నీకే తెలియని నిను చూస్తు
నీ ఔన్నత్యం ఉదారత్వం నీ సమయ స్పూర్తి నీ సమస్త
మానసిక శారీరక తత్వాలను అద్యయనం చేసింది..
చిన్న చిన్న పొరపాట్లు తప్పా అన్ని సద్గుణాల సమహార
భూషితమైన గుణ సంపద మీలో మీ మాటలో
మీరు చేసే పనులలో స్పష్టం గా చూసింది…
ఆడదానిగా మూడుముళ్ళు వేయించుకొని
ఏడు అడుగులు నడచి
మీతో చేసే వందేళ్ల జీవనప్రయాణంలో
ఆనందంగా సాగేందుకు సాగుతుందనేందుకు సంపూర్ణ మైన నమ్మకం మీ ప్రతి కదలికలో
మీ ఆలోచన విధానంలో,
ముఖ్యంగా ఆడవారికి, మీరు ఇచ్చే గౌరవ భావంలో
అధ్బుతం గా మీ వ్యక్తిత్వం వికసించి వుంది..
కాల ప్రవాహంలో ఓ మగాడి మనసు స్థిరత్వం అనేది
అతని యుక్త వయసు లో
స్త్రీలను సోదరి తల్లి భావనతో చూసే ఏ పురుషుడైనా
ఆ తరువాత కాలమంతా పురుషోత్తముడిగానే పరిగణించ
బడతాడు.. ఆ సత్ లక్షణాలు గల లోకాభిరాముడివి నీవు
అనడంలో ఏ సందేహం లేదు నాకు….
అందుకే
ఈ మగువ కోరుకునే అభినవరాముడివి నీవు,
తెగువ చేసి చెబుతున్నా ఐ లవ్ యు అని..

Related posts