ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై గోపి అనే వ్యక్తి హైదరాబాద్ లో ఫిర్యాదు చేశారు. అభిమానుల్ని కించపరిచేలా వర్మ వ్యవహరిస్తున్నారని పేట్‌బషీర్‌బాద్ పీఎస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల్లో మార్ఫింగ్ ఫొటోలతో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలను మార్ఫింగ్ చేసి వైసీపీ లో చేరినట్లు పెట్టారని పేర్కొన్నారు. వర్మపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏప్రిల్ 13న వర్మ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. చంద్రబాబు భుజంపై జగన్ వైకాపా కండువా వేసినట్లు ఉన్న మార్ఫింగ్ ఫొటోను షేర్ చేశారు. ‘వావ్.. షాకింగ్ మలుపు. ఇప్పుడే చంద్రబాబు వైసీపీ లోచేరారు’ అని ట్వీట్ చేసీన సంగతి తెలిసిందే.