telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

రైలులో నిద్ర‌పోయిన మ‌హిళ‌ల‌పై సామూహిక అత్యాచారం…

చెన్నైలో తాగిన మైకంలో రైలులో నిద్ర‌పోయిన మ‌హిళ‌ల‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.. అది కూడా రైలు బోగీలో ఈ దారుణానికి ఒడిగ ట్టారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చెన్నై శివారు ప్రాంతంలో నివాసం ఉండే 40 ఏళ్ల మ‌హిళ‌.. తాంబరం – చెన్నై బీచ్‌ స్టేషన్‌ల మధ్య తిరిగే సబర్బన్ రైళ్ల‌లో తినుబండారాలు, పండ్లు విక్రయిస్తుంటుంది. అయితే, స‌ద‌రు మ‌హిళ‌ల‌కు మద్యం తాగే అల‌వాటుకూడా ఉంద‌ని చెబుతున్నారు.. శనివారం కూడా య‌థావిథిగా సబర్బన్ రైళ్ల‌లో పండ్లను విక్రయించిన ఆమె..  అనంతరం మద్యం తాగి  చివరి బోగీలో కూర్చిండిపోయింది.. అలాగే నిద్ర‌మ‌త్తులోకి జారుకుంది.. తను దిగాల్సిన చోట దిగ‌లేదు.. అయితే, ఆ రైలు చెంగల్పట్టుకు వెళ్ళి మళ్లీ తాంబరం షెడ్డుకు వచ్చేంత వరకు నిద్రలోనే ఉంది. అదిగ‌మ‌నించిన రైలు సిబ్బంది.. రైలును షెడ్డుకు త‌ర‌లించారు.. అక్క‌డే ఆమెపై సామూహిక అత్యాచారం జ‌రిగింది.. మ‌ద్యం మ‌త్తులో నిద్ర‌లో ఉన్న స‌ద‌రు మ‌హిళ‌ను గ‌మ‌నించిన‌ బోగీలను శుభ్రం చేసే దినసరి కార్మికులు… ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంత‌రం నేరుగా తాంబరం రైల్వే పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది బాధితురాలు.

Related posts