telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

జీవిత గమ్యం…

ఎంతసేపు ఎదురు చూచినా
నీవు వస్తావన్న నమ్మకం
నా పాత ట్రంకుపెట్టేలా
రంగువెలసిపోతుంది…
ఇక నీవు నన్ను ఆదరిస్తావనే ఆశ
నేను కూర్చున్న ఎత్తుకాళ్ళ పీట
నా వెన్నుకు బొత్తిగా ఆశరా ఇవ్వనట్టుగా
నీ మాటలపై నమ్మకం సన్నగిల్లిపోతుంది…
ఇప్పుడు ఆలోచిస్తూంటే
కలవని రైలుపట్టాల్లా
మన భావాలు ఎప్పటికీ కలవవని
స్పష్టంగా తెలుస్తూనే ఉంది…
అదిగో అటువైపుగా వచ్చే రైలుబండి
నా ఆత్మీయ మిత్రునిలా
అమ్మానాన్నల చెంతకు చేరుస్తాను
రమ్మంటోంది…
నిర్మానుష్యమైన ఈ ప్రదేశంలా
నాలోని ఆత్మిశ్వాసం పూర్తిగా
నిర్జీవం కాకముందే
అవిగో పైన కనిపించే విద్యుత్ తిగల్లో ప్రవహించే విద్యుత్ లా
ఇప్పుడు నాకు జ్ఞానోదయమైనట్టు
ఇక నా గమ్యాన్ని ఉన్నతంగా నిర్ణయించుకొంటాను…

Related posts