ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను అరికడతామని ఏపీ మంత్రి గిరిజనశాఖ మంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. పుట్టిన రోజు సందర్భంగా తొలిసారి ఆమె విశాఖలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ విశాఖ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం పుష్ప శ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ..అక్టోబర్ నుంచి రైతు భరోసా పథకం అమలు అవుతుందని ఉపముఖ్యమంత్రి,పార్టీలకు అతీతంగా కుల మత బేధాలు లేకుండా అందరకి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
లేనిది ఉన్నట్టు సృష్టించడం టీడీపీ నైజం: మంత్రి బుగ్గన