telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆ ఘనత సాధించిన తొలి ఇంగ్లాండ్ క్రికెటర్ గా మోర్గాన్…

ఈరోజు భారత్ ర్గో జరుగుతున్న మూడో టీ20 లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు.‌ ఈ మ్యాచ్ మోర్గాన్ కు 100వ టీ20 మ్యాచ్ కాగా.. ఈ ఫీట్ సాధించిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అలాగే ఈ ఘనత అందుకున్న నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో మోర్గాన్ కన్నా ముందు షోయబ్ మాలిక్(116), రోహిత్ శర్మ(108), రాస్ టేలర్(102)లు ఉన్నారు. ఇక కెప్టెన్‌గా అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా కూడా మోర్గాన్ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో 72 మ్యాచ్‌లతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాప్‌లో ఉన్నాడు. టాస్ సమయంలో మోర్గాన్ మాట్లాడుతూ… 100వ మ్యాచ్ ఆడటం పట్ల సంతోషంగా ఉందని, తనకు తన కుటుంబానికి ముఖ్యమైన రోజని మోర్గాన్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఇంగ్లాండ్ పర్యటనలోనే ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌తో టెస్ట్‌ల్లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు ఇయాన్ మోర్గాన్ పొట్టి ఫార్మాట్‌లో ఈ ఘనతను అందుకోవడం విశేషం.

Related posts