రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏపీకి రానున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్ధం ఈ నెల 24న తిరుమలకు రాష్ట్రపతి రానున్నారు. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు కలెక్టర్. ఈ నెల 24వ తేదీన ఉదయం 10:45 గంటలకు చైన్నై నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ తిరుపతికి చేరుకుంటారని పేర్కొన్నారు. అక్కడి నుంచి కారులో బయలుదేరి 11: 20 గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహం చేరుకుంటారు. మధ్యాహ్న తిరుమల శ్రీవారిని దర్శంచుకుని ఆ తర్వాత అహ్మదాబాద్‌కు బయలు దేరి వెళతారని కలెక్టర్ పేర్కొన్నారు. అయితే.. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటనలో చిన్న పొరపాట్లకు కూడా తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కొవిడ్ నియంత్రణ పాటిస్తూ ఆహ్వానం ఉండాలని తెలిపారు. రాష్ట్రపతిని ఆహ్వానించడానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ రానున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.