telugu navyamedia
రాజకీయ

ఏక్​నాథ్ శిందేకు శివసేన షాక్.. స్పందించిన ఏక్‌నాథ్‌ షిండే

*మంత్రి మంత్రి ఏక్‌నాథ్‌ షిండే పై చ‌ర్య‌లు
*శాస‌న‌స‌భ‌ప‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గింపు..
*అధికారం కోసం పార్టీకి ద్రోహం చేయబోం..
*బీజేపీకి వ్య‌తిరేకంగా శివ‌సేన కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌లు

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి దారితీసింది. శివసేన శాసనసభ్యుడు, కేబినెట్ మంత్రి ఏక్​నాథ్ శిందేపై ఆ పార్టీ కొరడా ఝుళిపించింది. ఎమ్మెల్యేలతో కలిసి సూరత్​లో మకాం వేసిన ఆయన్ను.. శాసనసభా పక్షనేత హోదా నుంచి తొలగించింది. శివాడీ ఎమ్మెల్యే అజయ్ చౌదరిని నూతన పార్టీ సభా పక్షనేతగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.

మరోవైపు..శాసనసభా పక్షనేత హోదా నుంచి తప్పించిన నేపథ్యంలో మంత్రి ఏక్‌నాథ్‌ షిండే తొలిసారి స్పందించారు ..అధికారం కోసం తాను మోసం చేయనని ఏక్​నాథ్ శిందే అన్నారు. అలాగే బాల్ ఠాక్రే బోధనలను తాను వదిలిపెట్టబోనని చెప్పుకొచ్చారు.

మేం బాలాసాహెబ్‌కు​ నిబద్ధత కలిగిన శివసైనికులం. అధికారం కోసం మేం మోసం చేయం. అలాగే బాల్ ఠాక్రే బోధనలను తాను వదిలిపెట్టబోనని చెప్పుకొచ్చారు. “హిందుత్వం గురించి మాకు పాఠాలు చెప్పిన బాలాసాహెబ్​కు మేం విధేయులమైన శివసైనికులం. ఆయనే మాకు హిందుత్వ పాఠాలు బోధించారు. అధికారం కోసం మేం మోసం చేయం. బాలాసాహెబ్, ఆనంద్ దిఘే పాఠాలను మరిచిపోం” అని మరాఠీలో ట్వీట్ చేశారు.

కాగా సోమవారం మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి మంత్రి ఏక్‌నాథ్ షిండేతో సహా 12 మంది శివసేన ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 12 మంది ఎమ్మెల్యేలతో షిండే గుజరాత్‌లోని సూరత్‌లో ఓ రిసార్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన సమావేశానికి కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వీరు కూడా శిందేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

శాసనసభా పక్షనేత హోదా నుంచి తప్పించిన నేపథ్యంలో.. ట్విట్టర్ బయో నుంచి ‘శివసేన’ అన్న పదాన్ని శిందే తొలగించారు. నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న షిండే.. తన ఎమ్మెల్యేతో కలిసి బీజేపీలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ వార్తలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కొట్టిపారేశారు. ‘శివసేన.. విధేయుల పార్టీ. బీజేపీ చేసే ప్రయత్నాలేవీ ఫలించవు. మధ్యప్రదేశ్, రాజస్థాన్​లో విఫలమైనట్టుగానే.. అఘాడీ ప్రభుత్వాన్నీ ఎవరూ కూల్చలేరు. శిందే నమ్మకస్తుడైన శివసైనికుడు. మిస్సింగ్ ఎమ్మెల్యేలను సంప్రదిస్తే వారు తిరిగి వస్తారు’ అని పేర్కొన్నారు.

Related posts