telugu navyamedia
రాజకీయ వార్తలు

విద్వేష పూరిత ప్రసంగాలెందుకు?: బీజేపీపై ప్రకాశ్ రాజ్ ఫైర్

Prakash

ఢిల్లీ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నేతల ఎన్నికల ప్రచార సరళిపై దక్షిణాది నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. “గోలీ, బిర్యానీ, టెర్రరిస్టులు, హేట్ స్పీచ్…” అంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడేందుకు ఇంతకన్నా ఎటువంటి అంశాలూ లేవా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు సిగ్గుండాలని నిప్పులు చెరిగారు.

మరోవైపు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్, బీజేపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలూ తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. హస్తిన పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతుండగా, తాము చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే తిరిగి అధికారాన్ని దగ్గర చేస్తాయని ఆప్ నమ్మకంతో ఉంది.

Related posts