telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురు

high court on new building in telangana

తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో షాక్‌ తగిలింది. సచివాలయం కూల్చివేత పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సచివాలయ భవనాలను కూల్చొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది.

కొత్త సచివాలయ భవన సముదాయ​నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను నేడు తెలంగాణ కేబినెట్‌ ఆమోదించనున్న వార్తల నేపథ్యంలో కోర్టు ఈ తీర్పు వెలువడటం గమనార్హం. కేబినెట్‌ భేటీ అనంతరం సచివాలయ భవనాల కూల్చివేత, కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టాలని భావించిన కేసీఆర్‌ సర్కార్‌కు కోర్టులో చుక్కెదురైంది.

Related posts