telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే…

polavaram

మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా మారిందని ప్రధానే అన్నారన్న ఆయన పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు తగవని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి చంద్రబాబు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలానే బీసీలకు గుర్తింపునిస్తూ కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తే బీసీలను విడగొడతున్నామని విమర్శలు చేస్తున్నారని కులమంటే చంద్రబాబు కులమేనా..? బీసీలవి కులాలు కాదా..? అని ఆయన ప్రశ్నించారు. కరోనా పేరు చెప్పి హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు మళ్లీ ఎన్నికలకే ఏపీకి వస్తారని ఎద్దేవా చేశారు. విశాఖ బీచ్ రోడ్డులో టూరిజం శాఖ తరపున కోడి రామ్మూర్తి విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్న ఆయన ఆంధ్ర హెర్కులస్సుగా పేరొందిన కోడి రామ్మూర్తి విగ్రహం ఏర్పాటు చేస్తే యువతకు స్పూర్తిగా ఉంటుందని అన్నారు. అలానే గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రొత్సహిస్తామన్న ఆయన 13 జిల్లాల్లో 13 అంతర్జాతీయ స్థాయి స్టేడియాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 13 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని ఓబెరాయ్ వంటి ప్రముఖ హోటల్ యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. 

Related posts