కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు జరుగుతున్న పోరాటం గురించి ప్రముఖ క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ సహా మొత్తం 49మంది క్రీడాకారులు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని క్రీడాకారులను మోదీ కోరారు. అభిప్రాయాలను అడిగి తెలుసున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రధాని మోదీ ఐదు సూత్రాలను ఉపదేశించారు. కరోనాపై యుద్ధంలో ‘సంకల్స్(సంకల్పం), సన్యం(సమన్వయం), సంక్రమత(సానుకూలత), సమ్మాన్(ఐకమత్యం), సహయోగ్(సహాయం).. అనే సూత్రాలను పాటించాలని, దేశ ప్రజల్లో ధైర్యాన్ని, సానుకూలతను నింపాలని క్రీడాకారులకు సూచించారు.