telugu navyamedia
రాజకీయ వార్తలు

పౌరసత్వ చట్టానికి మద్దతుగా.. బళ్లారిలో భారీ ర్యాలీ …

CAA support rally in ballary is success

పౌరసత్వ చట్టానికి మద్దతుగా బళ్లారిలో భారీ ర్యాలీ నిర్వహించి రాష్ట్రపతి పేరున ఉన్న వినతిపత్రాన్ని జిల్లాధికారికి అందజేశారు. నగరంలోని నారాయణరావు పార్క్‌ వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది హిందుత్వాన్ని బలపరుస్తూ కేసరి ధ్వజాలు, జాతీయ జెండాలతో భారత్‌ మాతాకీ జై… వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక రాయల్‌సర్కిల్‌లో ఏర్పాటు చేసిన వేదికపై ముందుగా పేజావర స్వామీజీకి నివాళులర్పించిన అనంతరం ప్రజలనుద్దేశించి స్వయంసేవా సంస్థ జాతీయ కార్యవర్గ సభ్యుడు షాకల్‌చంద్‌ బాగ్రేచ, సిటీఎమ్మెల్యే జీ సోమశేఖర్‌రెడ్డి, కల్యాణస్వామీజీ మాట్లాడారు. ఆరు ధర్మాల ఆధారంపై దేశ విభజన అయిందని, ఆనాడు ఒప్పందం ప్రకారం ఏ దేశంలో తమ ధర్మపాలన చేయవచ్చు అన్నారని, అయితే పాకిస్తాన్‌, బాంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్థాన్‌ హిందువులు, బౌద్ధులు తదితర ధర్మాలవారు ఆయా దేశాల్లో దౌర్జన్యాలకు గురవుతూ మన దేశంలోకి వచ్చారని, వారికి పౌరత్వం ఇవ్వడానికే ఈ యాక్ట్‌ అన్నారు. ఇక్కడున్న ముస్లింలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇబ్బందులు కలిగించరని, దీనిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. తప్పుడు సమాచారంతో మన దేశంలోకి వచ్చి వారి జనాభాను పెంచుతున్నవారికి కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు తమ ఓట్‌బ్యాంక్‌ కోసం మద్దతిచ్చి, ఓటర్‌ ఐడీ ఇచ్చి దేశద్రోహం చేశారన్నారు.

దేశం భాగాలు కావాలన్నవారే ఈ యాక్ట్‌ను వ్యతిరేకిస్తున్నారన్నారు. శాంతియుత దేశంలో ఘర్షణలు చెలరేగేలా యాక్ట్‌ను నిషేధించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడిచేస్తున్నారని, దేశంలోకి డిటెక్షన్‌ క్యాంప్‌ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వారు ముస్లింలుకారని, దేశంలో అల్లర్లు సృష్టించడానికి తప్పుడు సంకేతాలనిస్తున్నారని ఆరోపించారు. తాను ముందు భారతీయులమని, అనంతరం తాము స్వామీజీ అయ్యామని కల్యాణస్వామి పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెన్నబసవనగౌడ, డాక్టర్‌ ఎస్‌జేవీ మహిపాల్‌, మాజీ ఎంపీ సణ్ణపక్కీరప్ప, అనిల్‌నాయుడు, శ్రీరాములు, డాక్టర్‌ అరుణ, పాటీల్‌ సిద్దారెడ్డి, కేఏ రామలింగప్ప, గురులింగనగౌడ, ప్రకా్‌షరెడ్డి, మురారిగౌడ, శ్రీనివాస్‌ మోత్కూర్‌, కేఎస్‌ దివాకర్‌, అశోక్‌కుమార్‌, హలకుంది మల్లికార్జునగౌడ, నగరశాఖ అధ్యక్షుడు వెంకటేష్‌, హెచ్‌.హనుమంతప్ప, గణపాల్‌ ఐనాథ్‌రెడ్డి, ఏఎం సంజయర్‌, నరేశ్‌ చిరానియా, శివకుమార్‌, మాజీ మేయర్‌ బసవరాజ్‌, డాక్టర్‌ రాజశేఖర్‌ గాణిగెర, మృత్యుంజయస్వామి, మల్లనగౌడ, భరత్‌లతో పాటు పలు హిందూపర సంఘాల పదాధికారులు, కార్యకర్తలు, వేలాది మంది విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ స్థాయిలో జాతీయ జెండాను నగరంలో ర్యాలీ నిర్వహించారు.

Related posts