telugu navyamedia
తెలంగాణ వార్తలు నరేంద్ర మోదీ వార్తలు

అమ్మ పేరుతో మొక్కలు నాటాలి: బీజేపీ నేతల పిలుపు

 ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో మొక్కలు నాటాలని మేడ్చల్‌ జిల్లా బీజేపీ కన్వీనర్‌ మల్లారెడ్డి, కూకట్‌పల్లి నియెజకవర్గ ఇన్‌చార్జ్‌ మాధవరం కాంతరావు, మూసాపేట కార్పొరేటర్‌ కొడిచెర్ల మహేందర్‌ అన్నారు.

మంగళవారం మూసాపేటలో ప్రధాని మోదీ పిలుపు మేరకు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశాన్ని కాలుష్యరహితంగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారని, మన ఇంటికి ఇరువైపులా, ఖాళీ ప్రదేశాలు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.

అడవులు రోజురోజుకు అంతరించి పోతున్నాయని దానివల్ల వర్షాలు తగ్గడమే కాకుండా సూర్యతాపం మరింత పెరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి బీజేపీ కన్వీనర్‌ శ్రీకర్‌రావు, పద్మయ్య, ఎర్రస్వామి, మహిళా మోర్చా అధ్యక్షురాలు జానకి, లీగల్‌సెల్‌ సద్గుణరెడ్డి, రవిగౌడ్‌, రేవతి, శోభరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts