telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ ఇంట్లో తారల సందడి… బాలయ్య మిస్

Chiru

80వ దశకంలో తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సెలబ్రిటీలు అంతా కలిసి ప్రతీసారి గెట్‌ టు గెదర్‌ పార్టీ జరుపుకునే విషయం తెలిసిందే. అలాగే ఈ సారి కూడా 80స్ స్టార్స్ అంతా వచ్చి పండగ చేసుకున్నారు. నవంబర్ 24న చిరంజీవి ఇంట్లోనే ఈ పార్టీ గ్రాండ్‌గా జరిగింది. అంతేకాదు పార్టీకి వచ్చిన వాళ్లందర్నీ చిరు ప్రత్యేకంగా ఆహ్వానించడమే కాకుండా స్వయంగా డ్రింక్స్ కూడా సర్వ్ చేసాడని తెలుస్తుంది. ఇందులో చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి సమకాలీకులు అయిన నాగార్జున, వెంకటేష్, సుమన్, భానుచందర్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఇక తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా శరత్ కుమార్, ప్రభు లాంటి వాళ్లు వచ్చారు. మలయాళం నుంచి మోహన్ లాల్ వచ్చాడు. కన్నడ నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఇక హీరోయిన్లకు అయితే కొదవే లేదు. చాలా రోజుల తర్వాత అంతా ఒకేచోట కలుసుకున్నారు. అయితే ఎంతమంది వచ్చినా కూడా టాలీవుడ్ నుంచి బాలయ్య మిస్ అయ్యాడు. ఈ రీ యూనియన్ పార్టీలో నందమూరి బాలకృష్ణ కనిపించలేదు. ఈయన ప్రస్తుతం రూలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 20న విడుదల కానుండటంతో ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అందుకే రీ యూనియన్ పార్టీ మిస్ అయ్యాడు బాలయ్య. దక్షిణాదిన 80ల నాటి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటీనటులంతా గెట్‌ టు గెదర్‌లో సందడి చేశారు. చిరంజీవి, రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, వెంకటేశ్‌, భాను చందర్‌, నరేశ్‌, సురేశ్‌, జయసుధ, రాధిక, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్‌, జాకీష్రాఫ్‌, రెహమాన్‌, ప్రభు, శరత్‌కుమార్‌ ఇతర తారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Related posts