telugu navyamedia
సినిమా వార్తలు

“మజిలీ” ప్రీమియర్ షో కలెక్షన్స్

majili movie on april 5th

శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన “మజిలీ” సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికాలో సినిమా ప్రీమియర్ షోలకు భారీగా మంచి  స్పందన లభిస్తోంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోనూ పలు చోట్ల విడుదలైంది. తెలుగు రాష్ట్రాల కంటే ఒక్కరోజు ముందుగానే యూఎస్ లో ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ఈ షోలకు ప్రేక్షకుల నుండి సినిమా అద్భుతంగా ఉందని, సమంత, నాగచైతన్య నటన ఆకట్టుకుందని అంటున్నారు.

ఇక ఇప్పటికే ప్రదర్శితమైన ప్రీమియర్ షోల ద్వారా దాదాపు 135,171 డాలర్లు వసూలైనట్లు సమాచారం. నాగచైతన్య కెరీర్ లోనే  ప్రీమియర్ షోల ద్వారా ఇంత మొత్తం వసూలవ్వడం ఇదే మొదటిసారి. గతంలో నాగ చైతన్య నటించిన “సవ్యసాచి” సినిమాకు అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా 111,706 డాలర్లు వసూలయ్యాయి. ఇప్పుడు “మజిలీ” ఆ వసూళ్లను దాటి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

Related posts