telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

మోటార్ షో లో తళుక్కుమన్న .. ఫోక్స్‌ వ్యాగన్‌ ఎలక్ట్రిక్‌ కారు ‘ఐడి.3’…

volkswagen electric car id3 in motor expo

పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా వాహనాలలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కరెంట్ వాహనాలకు బాగా ఆదరణ లభిస్తుంది. దీనితో ఉత్పత్తిదారులు కూడా సరికొత్త వాహనాలను అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా, ప్రముఖ కార్ల కంపెనీ ఫోక్స్‌ వ్యాగన్‌ సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు ‘ఐడి.3’ని ఆవిష్కరించింది. ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన మోటార్‌ షోలో దీన్ని ప్రదర్శనకు ఉంచింది. ఈ కారు ధర 27,000 పౌండ్ల నుంచి 30,000 పౌండ్ల వరకు (రూ.24.03 లక్షల -రూ.26.69 లక్షలు) ఉంటుందని ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ కారు మోడల్‌ను మొత్తం మూడు వేరియంట్లలో 45 కిలోవాట్స్‌, 58 కిలోవాట్స్‌, 77 కిలోవాట్స్‌తో తీసుకొస్తున్నట్లు తెలిపాయి. ఐడి.3 గంటకు 99 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించనుంది.

ఒకసారి చార్జిచేస్తే నిరాటంకంగా 420 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ మోడల్‌కు చెందిన మొదటి ఎడిషన్‌ కార్లను 2020లో యూరప్‌ వినియోగదారులకు అందించనుంది. ఆ తర్వాత మరో రెండు రకాల ఎడిషన్లను ఆ తర్వాత విడుదల చేస్తామని పేర్కొంది. బ్యాటరీ చార్జింగ్‌ కోసం 100 కిలోవాట్స్‌ ఫాస్ట్‌ చార్జర్‌లో పెడితే అరగంటలో మొత్తం కారు బ్యాటరీ చార్జ్‌ అవుతుందని ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి.

Related posts