telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హైదరాబాద్ లో సుదీప్ సినిమా షూటింగ్ ప్రారంభం

Sudeep

లాక్‌డౌన్ వ‌ల‌న దాదాపు మూడు నెల‌లుగా సినిమాతో పాటు‌ షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. ఇటీవ‌ల ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన స‌డ‌లింపుల‌తో సీరియ‌ల్స్‌, రియాలిటీ షోస్ షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. అయితే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో తన సినిమాని ప్రారంభించారు. తక్కువ మంది సిబ్బందితో ప్రభుత్వ మార్గదర్శకాలతో “ఫాంటమ్” మూవీ షూట్ చేస్తున్నామని తెలియజేశారు కిచ్చా సుదీప్. సెట్‌లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాకి సంబంధించిన ప్రతి సభ్యుడు కూడా కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వారే. “లాక్‌డౌన్ వలన కొన్ని నెలలుగా పని లేని వారికి పని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.‌. ప్రతీది సజావుగా సాగాలని ఆశిస్తున్నాం” అని సుదీప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Related posts