telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

ఇక నుండి అంతర్జాతీయ విమానాశ్రయంలో.. మహిళా టాక్సీలు… అన్నివేళలా..

women taxis in international airporst

ఎప్పటి నుండో మహిళా టాక్సీలు అందుబాటులోకి తెస్తున్నట్టు వచ్చిన వార్తలు మొత్తానికి కార్యరూపాన్ని దాల్చాయి. మహిళా ప్రయాణీలకు మరింత భద్రత కల్పించే దిశలో బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌, కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ సహకారంతో మహిళలకోసం మహిళలే నడిపే ట్యాక్సీ సేవలకు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను బీఐఏఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ హరిమరార్‌, కేఎస్ టీడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కుమార్‌ కుష్కర్‌లు పచ్చజెండా చూపారు.

ఈ సందర్భంగా హరిమరార్‌ మీడియాతో మాట్లాడుతూ పగటిపూట ఈ సేవలకు కిలోమీటరుకు రూ.21.50 చొప్పున, రాత్రివేళల్లో రూ.23.50 చొప్పున చార్జీలు వసూలు చేస్తామన్నారు. జీపీఎస్ తోపాటు అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ట్యాక్సీలు మహిళా ప్రయాణీకుల భద్రతకు పూర్తి భరోసా ఇస్తాయన్నారు. రానున్న రోజుల్లో ఈ ట్యాక్సీల సంఖ్యను మరింతగా పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ ట్యాక్సీలలో డ్రైవర్‌లుగా సేవలందించే మహిళలు హిందీ, ఆంగ్లభాషలతోపాటు అన్ని దక్షిణాది భాషలలో ప్రావీణ్యం కలిగి ఉంటారని చెప్పారు. తొలిరోజే ఉమెన్‌ ఓన్లీ ట్యాక్సీలకు అనూహ్యస్పందన లభించడంతో నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Related posts