telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఎర్రటి గాయం గుండెకు తగిలితే… నల్లటి మరకలా ఉండిపోతే

పండిన శరీరం
చిగురుటాకులా వణికిపోతోంది
చాలీచాలని దుప్పటితో
ప్రేమనంతా కప్పుకొని
కాళ్లను కుంగదీసే చుకుని
పెంచిన పిల్లలను మదిలో తలుచుకొనే…!!
ఎర్రటి గాయం గుండెకు తగిలితే
నల్లటి మరకలా ఉండిపోతే
ఊపిరి ఉన్నంతవరకు ధారపోసే
ఉయ్యాల లాలి పాటలోని
అర్థాలని గుర్తుకు తెచ్చుకొని
ముడతలు పడ్డ ముఖములో
ముసిముసి నవ్వుల నిన్ను తలుచుకుంటే…
మలమూత్రాల ను కడిగిన చెయ్యే
గోరుముద్దలు తినిపించి
కొండంత భరోసాను ఇస్తే
చెయ్యికి ఊత కర్ర నుంచి
అనాధాశ్రమాలకు తప్పుగా ఇస్తున్నారు…!!
అనాధల దారుల వెంట పోతున్నారు
రెక్కల కష్టానంతా ఆస్తిగా ఇచ్చి
నాలుగు మెతుకుల కోసం
నానా యాతన పడుతుంటే
ఆనాడు కడుపు నింపిన చేతులే
నేడు కోస్తున్నాయి ఆకలి కోతలు…!!
కాటికి దగ్గరవుతూ
ఊరికి దూరమవుతూ
చివరి క్షణాల్లో అనురాగాలు లేక
గుప్పెడు ప్రేమ కోసం ఎదురుచూస్తూ
నిర్భాగ్యులు నిలబడ్డారు..
గుళ్లో పూజలు చేసే బదులు
కన్న తల్లిదండ్రులను చూడండి
గొప్పగా దానాలు చేసేముందు
ఇంట్లో వృద్ధులకు సేవా చెయ్యండి
ఇంట్లో వారికి ప్రేమ పంచి
బయటి వారిని ఆశీర్వదించండి..!!

Related posts