telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు ఉద్యోగాలు రాజకీయ వార్తలు

ఏపీ లో సెమీకండక్టర్ తయారీ యూనిట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో రూ.4,600 కోట్ల భారీ పెట్టుబడితో సెమీకండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ కీలక నిర్ణయంపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ రంగం ఎదుర్కొంటున్న సెమీకండక్టర్ల కొరతను ఒక అవకాశంగా మార్చుకుని, భారతదేశంలో దేశీయ తయారీని ప్రోత్సహించడం అభినందనీయమని పవన్ కల్యాణ్ అన్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ భారీ పెట్టుబడి ద్వారా రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి గణనీయంగా పుంజుకుంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ముఖ్యంగా, ఈ పరిశ్రమ ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కేవలం ఉద్యోగాల కల్పనే కాకుండా, ఎగుమతులను ప్రోత్సహించడానికి, తద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని సాధించడానికి ఈ యూనిట్ ఎంతగానో దోహదపడుతుందని తన ప్రకటనలో వివరించారు.

ఈ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Related posts