అమరావతి రైతుల పోరాటానికి అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేంద్రం అనుమతితోనే రాజధాని అమరావతిని మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఇందులో వాస్తవం లేదని బీజేపీ పెద్దలు తనకు చెప్పారని పవన్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి పాత్రలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలని సూచించారు. త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.


కమ్మ సామాజిక వర్గంపై ఏపీ సీఎం కక్ష్య: సుంకర ఆరోపణ