telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పాక్ కాల్పులపై భారత్ ఫైర్ ..రాయబారికి సమన్లు జారీ!

kashmir encounter

కాశ్మీర్ సరిహద్దులో పాక్ సైన్యం జరిపిన కాల్పులపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మృతి చెందడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై పాకిస్థాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. పాక్ కాల్పుల్లో అమాయక ప్రజలు మృతి చెందడంపై పాకిస్థాన్ హైకమిషన్‌లోని తాత్కాలిక రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసినట్టు తెలిపింది.

దేశంలోని సాధారణ పౌరులపై పాక్ సైన్యం కావాలనే కావాలనే కాల్పులు జరుపుతోందని భారత్ పేర్కొంది. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంపైనా నిరసన వ్యక్తం చేసిన భారత్ 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని హితవు పలికింది.

Related posts