telugu navyamedia
రాజకీయ వార్తలు

పాకిస్తాన్ ను బ్లాక్ లిస్టులో ఉంచిన ఎఫ్ఏటీఎఫ్

Surgical Strike 2Pakistan Indian air space

టెర్రరిస్టు కార్యకాలాపాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ కు అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాక్ ను బ్లాక్ లిస్ట్ లో ఉంచింది.

టెర్రరిస్టు సంస్థలకు ఆర్థిక సాయం అందించడం, మనీ లాండరింగ్ కు పాల్పడటం వంటి కారణాలతో ఎఫ్ఏటీఎఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టెర్రరిస్టులకు   నిధులను అందించే అంశానికి సంబంధించిన 40 పారామితుల్లో 32 పారామితులు సమ్మతించే విధంగా లేవని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది. 41 మంది సభ్యుల ప్యానెల్ ను పాకిస్థాన్ తన వాదనతో ఒప్పించలేకపోయిందని వెల్లడించింది . మరోవైపు, బ్లిక్ లిస్టు నుంచి తప్పించుకోవడానికి అక్టోబరులోగా పాకిస్థాన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశ క్రెడిట్ రేటింగ్ పడిపోతుందని వెల్లడించింది.

Related posts