మా తమ తదుపరి గమ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అనికాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ అన్నారు.
కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లోని 22 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు.
విశాఖపట్నంలో భారీగా పెట్టుబడుల విస్తరణకు శ్రీకారం చుడుతున్నట్లు దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ యాజమాన్యం ప్రకటించింది. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 22 ఎకరాల్లో ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
దీని ద్వారా 8 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. 2026 కల్లా కార్యకలాపాలు ప్రారంభించి 2029 నాటికి తొలిదశ పనులు పూర్తి చేస్తామంది. కాగా రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు మరో ప్రఖ్యాత ఐటీ కంపెనీ రానుంది. ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కాగ్నిజెంట్ ముందుకు వచ్చింది. రూ.1,582 కోట్ల పెట్టుబడితో 8,000 మంది యువతకు ఉద్యోగాలను కల్పించనుంది.
ఈ మేరకు కాగ్నిజెంట్ పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి సహకారం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఎఐసీసీ పెద్దల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు: డీకే అరుణ