ఉ.కొరియా తాజాగా సూపర్ లార్జ్ మల్టిపుల్ రాకెట్ లాచర్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఆ దేశ అధికార వార్తా సంస్థ కెసిఎన్‌ఎ శుక్రవారం వెల్లడించింది. ఈ ప్రయోగాన్ని ఉ.కొరియా ప్రభుత్వ ఆధ్వర్యంలోని అకాడమీ ఆఫ్ డిఫెన్స్ సైన్స్ నిర్వహించిందని తెలిపింది. దీనికి ముందు రెండు స్వల్పశ్రేణి రాకెట్లను ఉ.కొరియా ప్రయోగించినట్లు ద.కొరియా మీడియా వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ ప్రయోగాలు విజయవంతం కావటంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉ.కొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ ఈ వ్యవస్థలను రూపొందించిన రక్షణ నిపుణులకు అభినందనలు తెలియచేశారని కెసిఎన్‌ఎ వెల్లడించింది. ఒకపక్క చర్చలు మరోపక్క ఈ పరీక్షలతో ట్రంప్ కి పక్కలో బల్లెం లా తయారవుతున్నాడు కిమ్. ఈ పరీక్షలపై అమెరికా ఇంకా స్పందించాల్సి ఉంది.