telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హర్ట్ అయిన “కలర్ ఫోటో” బ్యూటీ

chandini-chowdary

సుహాస్ హీరోగా నటించిన ”కలర్ ఫోటో” బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో సుహాస్ సరసన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా… చాందిని దీప్తి అనే పాత్రలో నేచురల్ పెర్ఫార్మన్స్ తో స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో చాందినీ తన నటనతో ఆడియన్స్ ని ఏడిపించింది. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖులు అందరూ మెచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమాని పొగుడుతున్న సెలబ్రెటీలు చాందినీ చౌదరి పేరును మరచిపోతున్నారు. కమెడియన్ హర్ష , హీరో సుహాస్, విలన్ సునీల్, దర్శక నిర్మాతలు సందీప్ రాజ్, సాయిరాజేష్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ లను మాత్రమే మెచ్చుకుంటున్నారు. కానీ చాందినిని మాత్రం పట్టించుకోవట్లేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ హర్ట్ అయ్యిందని తెలిసింది. ఈ అమ్మడు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మహేష్ చెల్లెలుగా నటించి ఆడియన్స్ కంట్లో పడింది. తర్వాత ఒకటో రెండో మూవీస్ చేసిన కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఇక సీనియర్ కమెడియన్ సునీల్ విలన్ గా నటించాడు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించగా, కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీతం అందించాడు. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘హృదయ కాలేయం’ సాయి రాజేష్ నిర్మించారు.

Related posts