telugu navyamedia
రాజకీయ వార్తలు

డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపివేయడం మంచిదికాదు: ఐరాస

UNO Anthoniya

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు అమెరికా నుంచి అందుతున్న నిధులను నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరెస్ స్పందించారు. డబ్ల్యూహెచ్‌వో కు నిధులు నిలిపివేయడానికి ఇది తరుణం కాదని ఆయన అన్నారు. వైరస్‌పై పోరాడుతున్న తరుణంలో డబ్ల్యూహెచ్‌వో లేదా మరే ఇతర మానవీయ సేవల సంస్థకు నిధులు నిలిపివేయడం మంచిదికాదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కరోనాపై ప్రపంచం మొత్తం తిరుగులేని పోరాటం చేస్తున్న సమయంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అన్నారు.వైరస్‌ను, దాని దుష్ప్రభావాలను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు సంఘటితంగా పోరాడాల్సి ఉందని అన్నారు. ప్రపంచం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ప్రపంచ దేశాలు ఏకతాటిపై నిలబడాలని తెలిపారు. పాత విషయాలను గుర్తు చేసుకుంటూ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదని అంటోనియో వ్యాఖ్యానించారు.

Related posts