telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ముంబై పోలీసులు సహకరించడం లేదు: బీహార్ సీఎం నితీశ్

Nitish kumar Bihar cm

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. సుప్రీంకోర్టే తీర్పును వెలువరించిన తర్వాత. ఈ కేసు విషయంలో మరో మాటకు తావు లేదని అన్నారు.

ఏదైనా ఒక కేసుకు సంబంధించి బీహార్ పోలీసులకు ఫిర్యాదు వచ్చిన తర్వాత దర్యాప్తు చేయడం రాష్ట్ర పోలీసుల విధి అని నితీశ్ అన్నారు. ముంబై పోలీసులు తమ పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని నితీశ్ చెప్పారు. ముంబై పోలీసుల తీరును ప్రపంచమంతా చూస్తోందని అన్నారు. బీహార్ పోలీసుల చర్య సరైనదనే విషయం సుప్రీం తీరుతో అర్థమవుతోందని చెప్పారు. సుశాంత్ కుటుంబానికి న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని నితీశ్ పేర్కొన్నారు.

Related posts