telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఫ్లాష్‌..ఫ్లాష్‌- ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ..

థర్డ్ వేవ్ దృష్ట్యా ముందస్తు చ‌ర్య‌లుగా సీఎం జగన్ ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతోన్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. థియేటర్లలో 50 శాతం అక్యుపెన్సీ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అటు దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలలో కూడా కోవిడ్ ఆంక్షలు అమలు చేయాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి, భౌతిక దూరం వంటి నిబంధనలు ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

బిగ్‌ బ్రేకింగ్‌ : ఏపీలో నైట్‌ కర్ఫ్యూ.. | NTV

రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించిన సీఎం.. పలు కీలక ఆదేశాలను జారీ చేశారు.

కోవిడ్ నిబంధ‌న‌లు ఇవే..

కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం సూచించారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలని, మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలన్నారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చూడాలని జగన్ సూచించారు.

బస్సు ప్రయాణికులు కూడా మాస్క్‌ ధరించేలా చూడాలని, బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని సీఎం ఆదేశించారు. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అంటే… సీటు మార్చి సీటుకు అనుమతించాలన్నారు. మాస్క్‌తప్పనిసరి చేయాలన్నారు.

Night curfew in Andhra Pradesh from today

అలాగే..104 కాల్‌ సెంటర్‌ను బలంగా ఉంచాలి. ఎవరు కాల్‌చేసినా వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలి. కోవిడ్‌ కేర్‌ సెంటర్లను కూడా సిద్ధం చేయాలని అన్నారు..నియోజకవర్గానికి ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి.అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసేలా తగిన చర్యలు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Related posts