telugu navyamedia
సినిమా వార్తలు

అడల్ట్ సినిమాలకు బ్రేకిస్తున్న సెలబ్రిటీ కపుల్ 

Priyanka-Chopra-and-Nick-Jonas
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ పాప్ సింగర్ గతేడాది పెళ్లి  చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కొంతమంది సెలెబ్రిటీలు పెళ్లి త‌ర్వాత కూడా హాట్ హాట్‌ సీన్ల‌లో న‌టించేందుకు సిద్ధ‌మేనంటూ ఇటీవ‌లి కాలంలో ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. కానీ దీనికి విరుద్ధంగా నిర్ణ‌యం తీసుకున్నారు ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్‌. ఇప్ప‌టివ‌ర‌కు హాట్ హాట్ స‌న్నివేశాల్లో రెచ్చిపోయి న‌టించిన వీరిద్ద‌రూ ఇక‌పై అలాంటి సినిమాల్లో క‌నిపించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇక‌పై అడ‌ల్ట్ సినిమాలు, టీవీ షోలు, మ్యూజిక్ సిరీస్‌ల్లో న‌టించ‌బోమ‌ని తాజాగా ఓ హాలీవుడ్ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్ జోనాస్ స్ప‌ష్టం చేశాడు. “ఇంత‌కు ముందు నేను, ప్రియాంక అడ‌ల్ట్ థీమ్‌తో వ‌చ్చిన కొన్ని సినిమాలు, కార్య‌క్ర‌మాలు చేసి ఉండ‌వ‌చ్చు. ఇక‌పై అలాంటివి చేయ‌కూడ‌ద‌ని నిర్ణయించుకున్నాం. భ‌విష్య‌త్తు, కుటుంబం, పిల్ల‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. ఇక‌పై, అడ‌ల్ట్ కంటెంట్ ఉన్న ఏ కార్య‌క్ర‌మాన్ని, సినిమాను మేం అంగీక‌రించ‌బోము” అని నిక్ తెలిపాడు. అయితే ఈ నిర్ణయం తీసుకుంది నిక్ అని తెలుస్తోంది. 

Related posts