telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మరో కొత్త వైరస్.. ఎక్కడంటే..?

corona

చైనా నుండి వచ్చిన కరోనా ప్రజలను గత ఏడాది నుండి ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. అయితే ఈ  వైరస్ మహమ్మారి ధాటికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణుకుతున్నది.  కరోనా వైరస్ ఒక్కో దేశంలో ఒక్కో విధంగా రూపాంతరం చెందుతూ ఆందోళన కలిగిస్తోంది.  బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ ఆ దేశాన్ని ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తోందో చెప్పక్కర్లేదు.  అదే విధంగా దక్షిణాఫ్రికా, నైజీరియాలో వెలుగుచూసిన కొత్త వైరస్ లు కూడా ఆయాదేశాల్లో విజృంభిస్తున్నాయి.  ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు బ్రెజిల్ లో కూడా కొత్తరకం కరోనా స్ట్రెయిన్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు.  కరోనా వైరస్ 10 రకాలుగా రూపాంతరం చెందినట్టు నిపుణులు గుర్తించారు.  బ్రెజిల్ లో వెలుగుచూసిన కొత్తరకం స్ట్రెయిన్, బ్రిటన్, దక్షిణాఫ్రికాలో గుర్తించిన స్ట్రెయిన్ ల కంటే ఎక్కువ జన్యురూపాంతరం చెందినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ కొత్తరకం స్ట్రెయిన్ పై పనిచేయకపోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.  బ్రెజిల్ లో వెలుగుచూసిన కొత్త స్ట్రెయిన్ కు సంబంధించిన కేసులు జపాన్ లో కూడా నమోదవుతున్నాయి.  అయితే, ఇండియాలో నెక్స్ట్ స్ట్రెయిన్ కేసులు నమోదు కాలేదని పరిశోధకులు చెప్తున్నారు.  చూడాలి మరి ఐదు కూడా ప్రపంచమంతా విస్తరిస్తే అంతే సంగతి మరి.

Related posts