telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మొదటి స్థానంలో ప్రభాస్… తరువాత అల్లు అర్జున్

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫేస్‌బుస్‌లోనూ ప్రభాస్ ఓ అరుదైన రికార్డ్‌ని నెలకొల్పారు. ప్రభాస్ ఫేస్‌బుక్ ఫాలోవర్స్ సంఖ్య 14 మిలియన్లకు చేరింది. ఇప్పటి వరకు దక్షిణాది నటులలో ఫేస్‌బుక్‌లో ఇంత ఫాలోయింగ్ ఉన్న నటులు ఎవరూ లేరు. సూపర్ స్టార్ రజినీకాంత్‌కు కూడా 3 లక్షల లోపు ఫాలోవర్సే ఉండటం విశేషం. ఇక ప్రభాస్ తర్వాత స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. 13.1 మిలియన్ల ఫాలోవర్స్‌ అల్లు అర్జున్‌కు ఉన్నారు. దీనినే చూపిస్తూ ఇప్పుడు ప్రభాస్ ఫస్ట్.. బన్నీ నెక్స్ట్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు హడావుడి చేస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రంతో ఎవరూ తిరిగిరాయలేని రికార్డును క్రియేట్ చేశారు ప్రభాస్. ఆ చిత్రం తర్వాత అన్ని నాన్ బాహుబలి రికార్డులే కానీ.. ‘బాహుబలి’ని బీట్ చేసే చిత్రం ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ బీట్ చేసే అవకాశం ఉందనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో కలెక్షన్లపరంగా రికార్డులు కొట్టడం అంత సామాన్యమైన విషయం కాదు.

Related posts