కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న “తలైవీ” చిత్రం ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకోగా, లాక్‌డౌన్ తర్వాత మిగతా భాగాన్ని పూర్తి చేయనున్నారు. అయితే ఈ చిత్రం ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల అవుతుందని వస్తున్న వార్తలని కంగనా రనౌత్ ఖండించారు. భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, బైలింగ్యువల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ, తమిళ భాషలకి గాను అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ రూ.55 కోట్లకి సొంతం చేసుకున్నాయి. ఇక తలైవి చిత్రంలో ‘తలైవి’లో సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఓ కీలక పాత్ర పోషిస్తోందట. జయలలిత తల్లి వేదవల్లి పాత్రలో భాగ్యశ్రీ నటించబోతోందట. సంధ్యగా పేరు మార్చుకుని వేదవల్లి కూడా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. జయలలిత వ్యక్తిగత, సినీ జీవితంలో ఈమెది ప్రధాన పాత్ర. వారిద్దరి మధ్య అనుబంధాన్ని సినిమాలో చూపించనున్నారట. ఆ పాత్రలో నటించేందుకు భాగ్యశ్రీ ఓకే చెప్పిందట. సినిమాలకు కొద్దికాలం బ్రేక్ ఇచ్చిన భాగ్యశ్రీ మళ్లీ పునరాగమనం చేయబోతోంది. ప్రభాస్ `రాధేశ్యామ్` సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది.
previous post
next post