telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జగన్ మోహన్ రెడ్డికి నట్టికుమార్ లేఖ ..

గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి , సినీ పరిశ్రమ తరపున కొంతమంది మాత్రమే మిమ్మల్ని కలుస్తున్నందువల్ల నాతో పాటు పలువురు , వాస్తవ పరిస్థితులను, మా అభిప్రాయాలను మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. 

ప్రభుత్వమే థియేటర్స్ ఆన్ లైన్ టికెట్ విక్రయ విధానానికి పూనుకునేలా జీవో నెంబర్ 782ను జారీ చేయడం అభినందనీయం. దీనిని కొనసాగించాలని అధికశాతం మంది ఎగ్జ్ బిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు కోరుకుంటున్నారు. అలాగే ఎఫ్ .డి .సి ద్వారా థియేటర్స్ కు బ్యాంకు వడ్డీకి రుణ సౌకర్యం కల్పించాలి. ఏపీలో షూటింగ్ చేసిన చిన్న చిత్రాలకు సబ్సిడీని అందించాలని కోరుతున్నాం.

YS Jagan Mohan Reddy ranks 3rd best CM in India

ముఖ్యంగా దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేస్తూ.. థియేటర్స్ ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయ విధానాన్ని ప్రభుత్వమే చేపట్టేందుకు పూనుకోవడం హర్షణీయం . దీనివల్ల దళారీ వ్యవస్థ లాభపడకుండా ప్రభుత్వానికే మంచి ఆదాయం సమకూరుతుంది. బుక్ మై షో వంటి సంస్థలు కేవలం ఒక టికెట్ కు అదనంగా 27 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. ఆ ఆదాయం ప్రభుత్వానికే వస్తే…ఒక రోజుకు 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఖజానాకు వస్తుంది. మరో విషయం ఆన్ లైన్ టికెట్స్ ద్వారా వచ్చిన డబ్బును ఏ రోజుకు ఆ రోజునే ఎగ్జ్ బిటర్ కు అందజేస్తే చాలా బావుంటుంది. ఎగ్జ్ బిటర్లు అంతా దీనినే కోరుకుంటున్నారు.

అలాగే 35 జీవోను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీలో షూటింగ్ చేసిన చిన్న చిత్రాలకు సబ్సిడీని అందించాలని కోరుతున్నాం. ఇంకో విన్నపాన్ని కూడా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. ఎ క్లాస్ సెంటర్స్ థియేటర్స్ కు కోటి రూపాయలు, బి క్లాస్ సెంటర్స్ థియేటర్స్ కు 50 లక్షలు, సీ క్లాస్ సెంటర్స్ కు 20లక్షల రూపాయలను ఎఫ్ .డి .సి ద్వారా బ్యాంకు వడ్డీకి రుణాలను ఇప్పించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.

కరోనా నేపథ్యంలో థియేటర్స్ కు శానిటైజర్ తదితరాలకు ఒక ప్రేక్షకుడికి 11 రూపాయలు ఖర్చు అవుతుంటే కేవలం 3 రూపాయలే ఇస్తున్నారు. దానిని కనీసం 7 రూపాయలు పెంచాలని కోరుతున్నాం. పేదవాడి మేలు కోసం ఎన్నో పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న మీరు సినీ పరిశ్రమ బాగు కోసం కృషి చెయ్యాలని  మా విజ్ఞప్తి.
-నట్టికుమార్, సీనియర్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్

Related posts