telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భూ హక్కు-భూ రక్ష ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం జగన్

cm jagan

కృష్ణా జిల్లాలోని తక్కెళ్లపాడుకు సీఎం జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా భూ హక్కు-భూ రక్ష ప్రాజెక్టును ప్రారంభించారు సీఎం జగన్. అంతేకాదు సర్వే రాయిని జగన్ వేశారు. 1928లో జరిగిన భూ సర్వే.. మళ్లీ ఇప్పుడే రీ-సర్వే చేస్తుంది ఏపీ ప్రభుత్వం. సర్వే పరికరాలను పరిశీలించారు జగన్. సర్వే చేపట్టే విధానాన్ని సీఎం జగన్‌కు వివరించిన సర్వే అధికారులు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా తక్కెళ్లపాడులో జరిపిన రీ-సర్వే మ్యాప్ పరిశీలించారు జగన్. డ్రోన్ ఆపరేట్ చేసి సర్వే ప్రక్రియను ప్రారంభించారు సీఎం జగన్. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు జగన్. జగన్ వెంట మంత్రులు ధర్మాన, పెద్దిరెడ్డి, బొత్స, పేర్ని, కొడాల, ఎంపీ మోపిదేవి తదితరులు పాల్గొన్నారు. సర్వే రాయి వేసే కార్యక్రమంలో రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts