telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కోవిడ్ వ్యాక్సీన్ రెండో డోసు వేయించుకున్న ప్రధాని మోడీ

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.28 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 630 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 59,856 డిశ్ఛార్జ్ అయ్యారు. ఇక కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోడీ కరోనా రెండో డోస్‌ తీసుకున్నారు. ఢిల్లీల ఎయిమ్స్‌లో కోవాగ్జిన్‌ రెండో డోసు వేయించుకున్నారు. ప్రధాని మోడీకి పంజాబ్‌కు చెందిన నర్సు నిషా శర్మ వ్యాక్సిన్‌ ఇచ్చారు. వ్యాక్సిన్‌ వేసుకున్న విషయాన్ని ప్రధాని మోడీ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు ఉన్న మార్గాల్లో వ్యాక్సిన్‌ కూడా ఒకటని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారంతా టీకా వేసుకోవాలని.. అందుకోసం కోవిడ్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచనలు చేశారు ప్రధాని మోడీ. కాగా…ప్రధాని మోడీ మొదటి డోస్‌ను గత నెల 1న వేయించుకున్నారు. రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన రోజే ఆయన వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 

Related posts