telugu navyamedia
రాజకీయ వార్తలు

స్వదేశీ అనేది మన నినాదం కావాలి: మోదీ

modi on jammu and kashmir rule

స్వదేశీ అనేది మన నినాదం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షికోత్సవం సందర్భంగా బెంగాల్ లోని ఇండస్ట్రీ ప్రముఖులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని అన్నారు. విజయం సాధించేంత వరకు మనో నిబ్బరాన్ని కోల్పోకూడదని చెప్పారు. అన్ని రంగాలపై కరోనా ప్రభావం చూపిందని అన్నారు. పరస్పరం సహకరించుకుంటూ విపత్కర పరిస్థితులను ఎదుర్కొందామని చెప్పారు.

ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూస్తున్నాయని చెప్పారు. సమస్యలపై భారత్ ఏక కాలంలో పోరాడుతోందని అన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుందామని పిలుపునిచ్చారు.భారతీయులు తమ సొంత ఉత్పత్తులకు, కళలకు ఇతర దేశాల్లో మార్కెట్ ను సృష్టించుకోవాలని మోదీ చెప్పారు. భారత్ ఆత్మ నిర్భర దేశంగా ఎందుకు అవతరించదని అన్నారు. మనం దిగుమతి చేసుకుంటున్న వస్తువులను మనమే ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదగాలని అన్నారు. ప్రజలు, భూగ్రహం, లాభం ఈ మూడు ఎప్పుడూ కలిసే ఉంటాయని చెప్పారు.

Related posts