telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ హృదయానికి ద‌గ్గ‌ర‌గా నమ్రత..!

సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు నేటితో 46వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు… ఈ స్పెష‌ల్ డే సందర్భంగా సెలెబ్రిటీల నుంచి మాత్రమే కాకుండా ఫ్యాన్స్ నుంచి కూడా సూపర్ స్టార్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్‌ మీడియాలో అయితే మొత్తం మహేశ్‌ ఫొటోలు, ఆయనకు సంబంధించిన ట్యాగ్‌లే క‌నిపిస్తున్నాయి.

How did Mahesh Babu fall in love with Namrata Shirodkar? - Movies News

అయితే ఫస్ట్ బెస్ట్ విషెస్ మాత్రం ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ నుండి రావడం విశేషం. మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నమ్రత శిరోద్కర్ మహేష్ తో కలిసి ఉన్న లవ్లీ ఫోటోని పోస్ట్ చేసింది. “నాపై ప్రేమను నిర్వచించే వ్యక్తి… నా అప్పుడు, ఇప్పుడు మరియు ఎప్పటికీ! పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ బాబు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను” అంటూ విష్ చేశారు. ఈ పిక్ లో నమ్రతను మహేష్ బాబు హృదయానికి ద‌గ్గ‌ర‌గా నవ్వుతూ ఉన్న ఫోటో ఇప్ప‌డు వైర‌ల్ అవుతుంది.

అలాగే తన ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రి గురించి చెబుతూ సీతూ పాప పెట్టిన పోస్టు అందరిని ఆకట్టుకుంటుంది. మహేశ్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘ప్రపంచానికి మీరు సూపర్‌ స్టార్‌ అయితే మాకు మాత్రం మీరే ప్రపంచం. హ్యాపీ బర్త్‌డే నాన్న. మా ఆటల్లో, అల్లరిలో, నవ్వడం, పాడటం ఇలా అన్నింటిలోను మీరు మాకు బెస్ట్‌ డాడీగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడే కాదు ఎల్లప్పుడు మిమ్మిల్నీ ప్రేమిస్తూనే ఉంటాను. లవ్‌ యూ నాన్న’ అంటూ సితార పోస్టు చేసింది.

Mahesh Babu wishes wife Namrata Shirodkar with a special post | Filmfare.com

మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల 2005లో పెళ్ళి చేసుకున్నారు ద. ఈ జంటకు 2006లో గౌతమ్‌, 2012లో సితార జన్మించారు. ఈ అందమైన ఫ్యామిలీ పిక్స్ తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.

Related posts