వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్నారు. ఉప్పెన భారీ హిట్ అయ్యింది. అలాగే ఉప్పెన సినిమా మూడు రోజుల్లో రూ.50కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఉప్పెన సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన వైష్ణవ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రంతో బిజీగా ఉన్నారు. వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాని స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వైష్ణవ్ తేజ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్న ఇచ్చాడట… అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది తెలియదు కానీ.. ప్రొడ్యూసర్ మాత్రం ఓకే అయ్యాడంట…! టాలీవుడ్ స్టార్ హీరో & ప్రొడ్యూసర్ అక్కినేని నాగార్జున వైష్ణవ్ తేజ్ మూడో సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవరించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వైశం రెండో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకొని విడుదలకు సిద్దంగా ఉంది. అతి త్వరలోనే క్రిష్ ఈ సినిమా థియేటిరికల్ రిలీజ్ గురించి ప్రకటన చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ప్రభావం రెండో సినిమాపై కూడా బాగా చూపిస్తోంది. వైష్ణవ్, క్రిష్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచానాలు ఉన్నాయి. మరి వైష్ణవ్ తన రెండో సినిమాతో కూడా అభిమానులను అనుకున్న స్థాయిలో అలరిస్తారేమో వేచి చూడలి.
previous post
next post