ఐరా ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతున్న నాగ శౌర్య నూతన చిత్రం ప్రస్తుతం విశాఖలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ లో హీరో నాగ శౌర్య ప్రమాదానికి గురవ్వడంతో ఆయన ఎడమకాలికి గాయమయ్యింది. ‘కేజీఎఫ్’ ఫేమ్ అంభరివ్ మాస్టర్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్స్ ని షూట్ చేస్తుండగా హీరో నాగ శౌర్య జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా స్టంట్ చేసిన ఈ హీరో 15 అంతస్థుల బిల్డింగ్ మీద నుంచి కింద పడ్డాడు. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందని చిత్ర యూనిట్ తెలిపింది. నాగ శౌర్య నడవలేని పరిస్థితిలో ఉండడంతో సినిమా షెడ్యూల్ ని క్యాన్సిల్ చేశారు. ఛలో సినిమాతో గతంలో హిట్ అందుకున్న ఈ హీరో ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసిన మరో సక్సెస్ అందుకోలేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కష్టపడుతున్న ఈ యువ హీరో.
previous post
next post