జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నారని ఏపీ రాజకీయాలను కుదిపేసే వ్యాఖ్యలు చేశారు మనోహర్. విజయవాడలో జనసేన, బీజేపీ నేతల సమావేశం అనంతరం నాదెండ్ల ఈ కామెంట్స్ చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి అండగా ఉంటానని హామీ కూడా ఇచ్చారని.. రైతుల సమస్యలపై అసెంబ్లీ ముట్టడిస్తామని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వెంట త్వరలోనే చిరంజీవి కలిసి రాబోతున్నారని… పవన్ కళ్యాణ్ కు చిరంజీవి నైతిక మద్దతు ఉంటుందని తెలిపిన మనోహర్ తెలిపారు. నాదెండ్ల వ్యాఖ్యలు ఏపీ రాజకీయా ల్లో చర్చనీయాంశంగా మారాయి. నాదెండ్ల చేసిన ఈ వ్యాఖ్యలు చిరంజీవి రీ-ఎంట్రీపై రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. అయితే ఏ ఉద్దేశంతో నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారనేది తెలియాల్సి ఉంది. కాగా.. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకటంటే ఒకటే సీటు గెలిచిని విషయం తెలిసిందే..
previous post
next post
తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసింది…