నేడు వన్ ప్లస్ సంస్థ 7 సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.15 గంటలకు బెంగళూరు, లండన్, న్యూయార్క్ నగరాల్లో ఏకకాలంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్ల లాంచింగ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లోనే వన్‌ప్లస్ 7, 7 ప్రొ ఫోన్లను విడుదల చేయనున్నారు. ఈ ఫోన్లను కొనుగోలు చేసే తమ కస్టమర్లకు జియో బంపర్ ఆఫర్లను అందివ్వనుంది. రూ.9,300 విలువైన బెనిఫిట్స్‌ను కస్టమర్లకు ఇవ్వనుంది.
ఈ నూతన మొబైల్ ఫోన్లలో జియో సిమ్ వేశాక రూ.299తో తొలి రీచార్జి చేసుకుని రూ.5400 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను వోచర్ల రూపంలో పొందవచ్చు. ఈ క్రమంలో ఒక్కోటి రూ.150 విలువైన 36 వోచర్లు (మొత్తం కలిపి రూ.5400 క్యాష్‌బ్యాక్) లభిస్తాయి. జియో యాప్‌లో వాటిని పొందవచ్చు. ఆ తరువాత నెల నెలా రూ.149 ప్లాన్‌తో కస్టమర్లు బెనిఫిట్స్‌ను పొందవచ్చు. ఇక రూ.299 ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 3జీబీ డ ఏటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు. ఇక ఇవేకాకుండా మరో రూ.3900 విలువైన బెనిఫిట్స్ కూడా వన్‌ప్లస్ 7 ఫోన్లను కొన్న జియో కస్టమర్లకు లభిస్తాయి.