నోటిఫికేషన్ ముందే కేసీఆర్ సాగర్ లో పర్యటించారు. మళ్లీ వస్తారని తెలుస్తోంది. దుబ్బాకకు ఒక్కసారి కూడా వెళ్లని కేసీఆర్ సాగర్ కు రెండుసార్లు ఎందుకు వస్తుండొ ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలి అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎంతో అభివృద్ధి చేశానని చెబుతున్న కేసీఆర్, జానారెడ్డి నామినేషన్ వేసి ప్రచారాలు నిర్వహించకుండా ఉందామన్న జానారెడ్డి సవాల్ ను ఎందుకు స్వీకరించలేదు. జేఏసీ అంటేనే జానా యాక్షన్ కమిటీ. నీ పద్ధతులు నచ్చకె విజయశాంతి వెళ్ళిపోయింది. తెలంగాణ బిల్లును ఆమోదించడానికి జానారెడ్డి, కాంగ్రెస్ ఎంపీల ఎంతో కృషి చేశారు. సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకుని తెలంగాణ కావాలన్నారు. కేసీఆర్ పిచ్చి కుక్కలను ఇక్కడ ప్రచారాలకు పంపాడు. ఆయన నియోజకవర్గ పరిధిలో ఇద్దరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు మొదలు వారి కుటుంబాలకు సమాధానం చెప్పు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని నేను నిరూపిస్తా మూడడుగుల జగదీష్ వస్తాడో, ఆరడుగుల పల్లా వస్తాడో రమ్మను అని చెప్పిన ఆయన సాగర్ లో తెరాస ఎన్నికల ఖర్చు 200 కోట్లట అని తెలిపారు. చూడాలి మరి దీని పై తెరాస నేతలు ఎలా స్పందిస్తారు అనేది.
previous post
next post