telugu navyamedia
రాజకీయ

జార్ఖండ్‌లో విద్యుత్ సంక్షోభం ఎందుకు ఉంది? : జార్ఖండ్‌ ప్రభుత్వంపై ధోని భార్య సాక్షి విమ‌ర్శ‌లు..

భార‌త‌ మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని భార్య సాక్షి ధోని జార్ఖండ్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. జార్ఖండ్‌లో విద్యుత్‌ సంక్షోభం ఇంతలా ఎందుకుందంటూ ట్విటర్‌ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Why is there a power crisis in Jharkhand?': Cricketer MS Dhoni's wife Sakshi tweets

”ఒక టాక్స్‌ పేయర్‌గా జార్ఖండ్‌ ప్రభుత్వానికి ప్రశ్న వేస్తున్నా… చాలా సంవత్సరాల నుండి  రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఇంతలా ఎందుకుందనేది తెలుసుకోవాలనుకుంటున్నా… ఒక బాధ్యత కలిగిన పౌరులుగా మా తరపు నుంచి విద్యుత్‌ను ఆదా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా సమస్య ఒక కొలిక్కి రావడం లేదు” అని పేర్కొంది.

Sakshi Dhoni Shares Unseen Pictures With Hubby, MS Dhoni From The Year 2008 And The Years After It

కాగా గత కొన్నిరోజులుగా జార్ఖండ్‌లో రోజువారి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మించిపోతున్నాయి. కరెంట్‌ వినియోగం పెరిగిపోవడం వల్ల లోడ్‌ మార్పు పేరుతో విద్యుత్‌ సిబ్బంది గంటల తరబడి కోత విధిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు.

Related posts