telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో… కానిస్టేబుల్ వీరంగం

Kakani Govardhan Reddy mla

వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ఇంట్లో మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ వీరంగంసృష్టించాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చోటుచేసుకుంది. ఉదయగిరి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జేమ్స్ నెల్లూరులో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం జేమ్స్ పీకలదాకా మద్యం తాగి రోడ్డుపై నానా రచ్చ చేశాడు. కొద్ది సేపటి తర్వాత ఆ కానిస్టేబుల్ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ఇంట్లో ప్రవేశించాడు.

భద్రతా సిబ్బందిని నెట్టుకొని ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రవేశించాడు. అందరినీ నోటికి వచ్చినట్లు తిడుతూ నానా హంగామా చేశాడు. అతడిని బయటకు తీసుకురావడం భద్రతా సిబ్బది తరం కాలేదు. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు జేమ్స్ ని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ని ఇబ్బంది పెట్టినందు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు.

Related posts