telugu navyamedia
సినిమా వార్తలు

“మిస్టర్ మజ్ను” ప్రీమియర్ షో టాక్

mister majnu movie in January

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ మజ్ను’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిపబ్లిక్‌ డే సందర్భంగా ఒకరోజు ముందు జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం ప్రీమియర్ షోకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అఖిల్ హిట్టు కొట్టేలా ఉన్నాడనిపిస్తోంది.

విదేశాల్లో ఉండే నిక్కీ (నిధి అగర్వాల్), విక్కీ (అఖిల్) ఇండియాలోని ఓ ఫ్యామిలీ వెడ్డింగ్ కు వచ్చి అక్కడ కలుసుకుంటారు. అఖిల్ చిలిపితనం, అఖిల్ పాత్రలో వచ్చే షేడ్స్, ఎమోషనల్ సీన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తికరంగా ఉన్నాయి. లవ్ స్టోరీ అక్కడక్కడా రొటీన్ గా, ద్వితీయార్థం స్లోగా అనిపించినప్పటికి దర్శకుడు మంచి సినిమానే అందించాడు. అయితే మ్యూజిక్ విషయంలో తమన్ మెప్పించలేకపోయాడు. కెమెరా పనితనం బాగుంది. ఇక అఖిల్ లుక్స్, డ్యాన్స్, ఫైట్స్ కూడా బావున్నాయి. మరి ప్రేక్షకులు ఈ సినిమాను ఎంత మేరకు ఆదరిస్తారో తెలియాలంటే మరికాసేపు ఆగాల్సిందే.

Related posts