telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“టక్ జగదీష్” సంక్రాంతి కానుక ఇదే…

నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తనదైన నటనతో నాచురల్ స్టార్‌గా బిరుదు అందుకున్నాడు. ప్రతి సినిమాలో పక్కింటి కుర్రాడిలా ప్రేక్షకుడికి దగ్గరవుతూ వచ్చాడు. ప్రస్తుతం నాని టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శివ నిర్వానా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే సంక్రాంతి సందర్భంగా చిత్ర యూనిట్ మరో పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో నానీ చేతికి పారాని పూస్తున్నారు. ఈ పోస్టర్‌లో ప్రముఖ నటులు జగపతి బాబు, నరేష్, రావు రమేష్, నాజర్ తదితరులు కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ద్వారా సినిమా సమ్మర్ స్పెషల్‌గా రానుందని రిలీజ్ డేట్ తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి బాక్స్‌ఆఫీస్ టక్ అవుతుందంటూ చెప్పారు. అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఈ పోస్టర్‌ను అభిమానుల తెగ షేర్ చేస్తున్నారు.

Related posts