కొద్ది సేపటి క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం కానుంది.
హైదరాబాదులోని ఫిలిం ఛాంబర్ లో ఈ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలవరకు కొనసాగింది. అసోసియేషన్ అధ్యక్ష పదవికి శివాజీరాజా, నరేష్ లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే చిరంజీవి శివాజీరాజా తరుపున, నాగబాబు నరేష్ తరుపున ఉండటం విశేషాన్ని సంతరించుకుంది. ఎవరు గెలుస్తారు అనేదానిపై అంచనా వేయలేని స్థితి. మరి కొద్దీ గంటలలో ఫలితాలు రానున్నాయి.