నేడు చెన్నైనగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మరో ఐదు రోజుల పాటు నగరంలో వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో చెన్నై నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. చెన్నై నగరం గత కొద్ది రోజులుగా నీటీ కటకట ఎదుర్కోంటుంది. ఈనేపథ్యంలోనే ఐటి కంపనీలు తమ ఉద్యోగులను ఇంటినుండే వర్కు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు.
నగరంలో పలు హోటళ్లు, వ్యాపార సముదాయాలు నీటీ కొరత వల్ల తమ వ్యాపారాలను క్లోజ్ చేసుకున్న పరిస్థితికి పుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైన్నై నగరంతోపాటు పలు ప్రాంతాల్లో వర్షలు విస్తారంగా కురిశాయి. ఇందులో బాగంగానే చైన్నై నగర శివారు ప్రాంతాలతోపాటు పల్లవరం, పోరూరు, సీమన్‌చేరి,లాంటీ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో అడుగంటిపోయిన భూగర్ఫజలాల్లో పెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నట్టు వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రజలు మార్పు కోరుకున్నారు: గంటా శ్రీనివాస్